కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వద్దని సుప్రీంకోర్టులో ఆంధప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. కృష్ణా నదిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రిపై పొన్నాల విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం విషయంలో ముఖ్యమంత్రి మాయమాటలు చెబుతున్నారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రాన్ని ఎందుకు అడగడంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
'ఏపీ వాదనపై కేసీఆర్ ఎందుకు స్పందించరు..?' - hyd latest news
కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదా వద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసినా.. కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ప్రాజెక్టుల విషయంలో తనతో చర్చలకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు.
'ఏపీ వాదనపై కేసీఆర్ ఎందుకు స్పందించరు..?'