విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు విడుదలకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్కు తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బహిరంగ లేఖ రాశారు. తనకు అత్యంత సన్నిహితుడు, తెలంగాణ వాది, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం పోరాటం చేసిన పెండ్యాల వరవరరావు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారని వివరించారు.
'వరవరరావు విడుదలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి' - మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లేఖ
విరసం నేత వరవరరావు విడుదలకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంపై పొన్నాల ఆందోళన వ్యక్తం చేశారు.
ponnala latter to cm kcr on varavara rao release
బీమాకోరేగావ్ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రధాన మంత్రితో, కేంద్ర హోం శాఖ మంత్రితో మాట్లాడి వరవరరావు విడుదల చేయించాలని విజ్ఞప్తి చేశారు.