తెలంగాణ

telangana

ETV Bharat / city

దేశ ప్రజలంతా పోలీసులను అభినందిస్తున్నారు: పొంగులేటి - దిశ హత్య కేసు నిందితులు

దిశ హత్యాచారం కేసులో పోలీసులు నిందితులకు సరైన శిక్ష వేశారని భాజపా నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి అన్నారు. పోలీసులను దేశ ప్రజలంతా అభినందిస్తున్నారని తెలిపారు.

ponguleti sudhakar reddy spoke on disha murder accused  encounter
దేశ ప్రజలంతా పోలీసులను అభినందిస్తున్నారు: పొంగులేటి

By

Published : Dec 6, 2019, 12:35 PM IST

తెలంగాణ పోలీసులను దేశంలోని ప్రజలంతా అభినందిస్తున్నారని భాజపా నేత పొంగులేటి సుధాకర్​రెడ్డి తెలిపారు. అత్యాచారం, హత్యను ప్రజలంతా ఖండిస్తున్నారని... ప్రజాకోర్టు కూడా వారిని ఉరి తీయాలని డిమాండ్​ చేసిందని తెలిపారు. దిశ కుటుంబసభ్యులకు అంతా అండగా ఉన్నారని అన్నారు. అత్యంత పాశవికంగా హత్య చేసిన నిందితులకు పోలీసులు సరైన శిక్ష వేశారని చెప్పారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టం రావాలని తెలిపారు. దీంతో పాటు మద్యాన్ని నిషేధించాలని సూచించారు.

దేశ ప్రజలంతా పోలీసులను అభినందిస్తున్నారు: పొంగులేటి

ABOUT THE AUTHOR

...view details