తెలంగాణ

telangana

ETV Bharat / city

యానాంలో పర్యటించిన పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి - యానాం వార్తలు

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. ఇందులో భాగంగా పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన.. పలు శాఖల అధికారులతో సమావేశమయ్యారు.

pondicherry cm narayana swanmy
యానాంలో పర్యటించిన పుదుచ్చేరి సీఎం నారాయణస్వామి

By

Published : Jan 6, 2021, 11:20 PM IST

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో.. పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.

యానాం ప్రభుత్వ అతిథి గృహం వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ముఖ్యమంత్రి.. గిరింపేట గ్రామంలో జూనియర్ కళాశాల భవనం ప్రారంభించి మొక్కలు నాటారు. విద్యార్థులకు అల్పాహారం పథకం, గోపాల్ నగర్​లో నిర్మించిన నూతన అంబేద్కర్ విజ్ఞాన భవన్​ను ప్రారంభించారు. అదే ప్రాంగణంలోని సమావేశ మందిరంలో యానాంలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఇదీ చూడండి:రేపే పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షల ఫలితాలు

ABOUT THE AUTHOR

...view details