తెలంగాణ

telangana

ETV Bharat / city

polycet 2021: తెలంగాణలో రేపటి నుంచి పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ - పాలిటెక్నిక్ వార్తలు

గురువారం నుంచి పాలిసెట్​ కౌన్సెలింగ్​ ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్​లో 100 శాతం సీట్లను కన్వీనర్​ కోటా కిందనే భర్తీ చేస్తారు. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభానికి ఏఐసీటీఈ నుంచి ఆమోదం రాకపోవడంతో పాలిటెక్నిక్​ ప్రవేశాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

polycet 2021
పాలిసెట్​ కౌన్సెలింగ్​

By

Published : Aug 4, 2021, 8:15 AM IST

రాష్ట్రంలో 2021-22 విద్యా సంవత్సరానికి 133 పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 30,512 సీట్లు అందుబాటులో ఉండనున్నాయి. అందులో 780 సీట్లు ఫార్మసీ కాగా మిగిలినవి పాలిటెక్నిక్‌ సీట్లు. గత ఏడాదితో పోల్చుకుంటే దాదాపు 3 వేల సీట్లు తగ్గాయి. రాష్ట్రంలో 54 ప్రభుత్వ కళాశాలల్లో 12,042 సీట్లు, ఒక ఎయిడెడ్‌ కళాశాలలో 230 సీట్లు, 64 ప్రైవేట్‌ కళాశాలల్లో 17,460 సీట్లతో పాటు 14 ఫార్మసీ కళాశాలలో ఫార్మసీ డిప్లొమా సీట్లున్నాయి. మూడు ప్రైవేట్‌ కళాశాలలు ఈసారి అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఈ నెల 5 (గురువారం) నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. పాలిటెక్నిక్‌లో 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కిందనే భర్తీ చేస్తారు. ఈ విద్యా సంవత్సరం కమలా నెహ్రూ పాలిటెక్నిక్‌ కళాశాలలో ప్రవేశాలు ఉండవని తొలుత ప్రకటించినా మళ్లీ ప్రవేశాలను కొనసాగిస్తున్నారని రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి వర్గాలు స్పష్టం చేశాయి. ఇంజినీరింగ్‌ కళాశాల ప్రారంభానికి ఏఐసీటీఈ నుంచి ఆమోదం రాకపోవడంతో పాలిటెక్నిక్‌ ప్రవేశాలు ఉంటాయని అధికారి తెలిపారు.

మొదటి విడత కౌన్సెలింగ్‌ కోసం ఆగస్టు 5 నుంచి 9 వరకు ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు చేసుకోవాలి. 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. 6 నుంచి 12 వరకు ఐచ్ఛికాలు (ఆప్షన్లు) ఇచ్చుకోవాలి. 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. చివరి విడత కౌన్సెలింగ్‌ కోసం ఆగస్టు 23న ఆన్‌లైన్‌లో ప్రాథమిక సమాచారం నమోదు చేసుకోవాలి. 24న ధ్రువపత్రాల పరిశీలన, 24, 25 తేదీల్లో ఆప్షన్ల నమోదు, 27న సీట్ల కేటాయింపు ఉంటుంది.

నేడు దోస్త్‌ సీట్లు కేటాయింపు

రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారా బుధవారం సాయంత్రం సీట్లను కేటాయించనున్నారు. మొత్తం 1.78 లక్షల మందికి పైగా విద్యార్థులు ఇటీవల దోస్త్‌ ద్వారా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నారు.

ఇదీ చూడండి:అడవిలో సంస్కరణల అలజడి.. చట్టంలో కీలక మార్పులు

ABOUT THE AUTHOR

...view details