పాలిటెక్నిక్, వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేడు పాలిసెట్ జరగనుంది. కరోనా పరిస్థితులతో గతంలో వాయిదా పడిన పరీక్షను ఇవాళ ప్రత్యేక జాగ్రత్తలతో నిర్వహించేందుకు ఎస్బీటీఈటీ సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 73 వేల 918 మంది హాజరు కానున్నారు. ఇందుకోసం 285 పరీక్ష కేంద్రాలు ఏర్పాట్లు చేశారు.
నేడు పాలిసెట్.. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే - నేడు పాలిసెట్
లాక్డౌన్తో వాయిదా పడిన పాలిసెట్ పరీక్ష... నేడు జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 285 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని బోర్డు తెలిపింది. విద్యార్థులు వ్యక్తిగత శానిటైజర్లు, మాస్కులు తెచ్చుకోవాలని, కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు.
![నేడు పాలిసెట్.. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే polycet conduct with covid preventions in telangana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8645649-thumbnail-3x2-poly.jpg)
నేడు పాలిసెట్.. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందే
ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు పరీక్ష జరగనుంది. పది గంటలకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నట్లు బోర్డు కార్యదర్శి శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత శానిటైజర్లు, మాస్కులు తెచ్చుకోవాలని, భౌతికదూరం వంటి... కరోనా నివారణ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇదీచూడండి..' వినాయక నిమజ్జనం ప్రశాంతంగా సాగడం సంతోషకరం'
Last Updated : Sep 2, 2020, 7:09 AM IST