తెలంగాణ

telangana

ETV Bharat / city

polycet 2021: పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల - polytechnic 2021 results

polycet-2021-results-are-released
polycet-2021-results-are-released

By

Published : Jul 28, 2021, 12:16 PM IST

Updated : Jul 28, 2021, 2:34 PM IST

12:14 July 28

polycet 2021: పాలిసెట్‌ 2021 ఫలితాలు విడుదల

రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించే పాలిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు  విడుదలయ్యాయి. అన్ని విభాగాల్లో కలిపి 92,557 విద్యార్థులు పరీక్ష రాయగా... ఎంపీసీ విభాగంలో 81.75 శాతం, బైపీసీ విభాగంలో 76.42 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 16940 మంది ఎస్సీ విద్యార్థులు పరీక్షకు హాజరవ్వగా... 16938 మంది ర్యాంకులు పొందారు. పరీక్ష రాసిన 10433 ఎస్టీ విద్యార్థుల్లో అందరు ఉత్తీర్ణులయ్యారు.

ఎంపీసీ విభాగంలో 118 మార్కులతో టాపర్​గా నిజామాబాద్​కు చెందిన అబ్దుల్ రెహ్మాన్ ముజ్తబ హస్మి నిలిచారు. బైపీసీ విభాగంలో 117 మార్కులతో టాపర్​గా సిద్దిపేటకు చెందిన కలకుంట్ల రిశిక నిలిచారు. polycetts.nic.in,sbtet.telangana.gov.in,www.dtets.cgg.gov.in లో విద్యార్థులు పాలిసెట్ ఫలితాలు చూసుకోవచ్చు.

 

షెడ్యూల్  ఖరారు...

ఇప్పటికే రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌, పాలిసెట్‌ ఛైర్మన్‌ నవీన్‌మిత్తల్‌ కౌన్సెలింగ్‌ కాలపట్టికను ఖరారు చేశారు. మొదటి విడత సీట్లను ఆగస్టు 14న కేటాయిస్తారు. విద్యా సంవత్సరం సెప్టెంబరు 1న మొదలవుతుంది. నాలుగో తేదీ వరకు ఓరియంటేషన్‌ కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి.

 

కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌..

ఆగస్టు 5 నుంచి తొలి విడత ప్రవేశాలు జరగనున్నాయి. ఆగస్టు 5 నుంచి 9 వరకు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ నిర్వహిస్తారు. అదే నెల 6 నుంచి 10 వరకు పాలిసెట్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. దీంతో పాటు 6 నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. ఆగస్టు 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. 23న తుది విడత పాలిసెట్‌ కౌన్సెలింగ్‌ ఉంటుంది. అదే రోజు ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవడానికి వీలు కల్పించారు. ఆగస్టు 24న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన.. 24, 25 తేదీల్లో రెండో విడత వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆగస్టు 27న రెండో విడత పాలిటెక్నిక్‌ సీట్లు కేటాయిస్తారు. సెప్టెంబర్‌ 1న నుంచి పాలిటెక్నిక్‌ విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుంది. సెప్టెంబరు 9న స్పాట్ ప్రవేశాలకుగాను మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు.

ఇదీ చూడండి:WATERFALLS: సొగసు చూడతరమా.. ఒంటిలొద్ది జలపాతం పాలపొంగు అందాలు

Last Updated : Jul 28, 2021, 2:34 PM IST

ABOUT THE AUTHOR

...view details