తెలంగాణ

telangana

ETV Bharat / city

"కాలుష్యం అరికట్టేందుకే.. హరితహారానికి శ్రీకారం" - GREEEN_BUILDING

హైదరాబాద్ మాదాపూర్​లోని హెచ్​ఐసీసీలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2019 సదస్సు జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి ప్రశాంత్​ రెడ్డి హాజరయ్యారు. పర్యావరణ రహిత నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించారు.

"కాలుష్యం అరికట్టేందుకే.. హరితహారానికి శ్రీకారం"

By

Published : Sep 28, 2019, 7:43 PM IST

పర్యావరణ కాలుష్యం మానవ మనుగడకు ప్రమాదకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగానే గుర్తించి రాష్ట్రములో హరితహారానికి శ్రీకారం చుట్టారని మంత్రి ప్రశాంత్​రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్​లోని హెచ్​ఐసీసీలో ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ 2019 సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చివరి రోజులో భాగంగా సదస్సుకు ఆయాదేశాలకు చెందిన ప్రతినిధులు హాజరై పర్యావరణ రహిత నిర్మాణాలపై సుదీర్ఘంగా చర్చించారు. గ్రీన్ బిల్డింగ్స్​ను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తుందన్నారు ప్రశాంత్​ రెడ్డి. పర్యావరణ పరిరక్షణకు సదస్సులో ప్రతినిధులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న వాటిని అన్ని సంస్థలు ఆచరిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ప్రతి ఒక్కరు మొక్కలని పరిరక్షిస్తే భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించిన వారమవుతామని ఆకాంక్షించారు.

"కాలుష్యం అరికట్టేందుకే.. హరితహారానికి శ్రీకారం"

ABOUT THE AUTHOR

...view details