దిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్‌ను వాహనదారులు తప్పనిసరిగా దగ్గర ఉంచుకుని తనిఖీ సమయంలో చూపించాలని.. లేకపోతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా లేదా రెండూ ఉంటాయని పేర్కొంటూ దిల్లీ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సర్టిఫికెట్ లేకుంటే లైసెన్స్‌ను 3నెలల పాటు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే ఆరు నెలల జైలు! - delhi government
ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతోన్న వాయుకాలుష్యాన్ని అరికట్టేందుకు దిల్లీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ సర్టిఫికెట్‌ను వాహనదారులకు తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తనిఖీ సమయంలో సర్టిఫికెట్ చూపించకపోతే ఆరు నెలల జైలు శిక్ష లేదా రూ.10,000 జరిమానా లేదా రెండూ ఉంటాయని తెలుస్తోంది.
pollution certificate
దేశ రాజధానిలో కరోనా లాక్‌డౌన్ సమయంలో వాయుకాలుష్యం చాలా వరకు తగ్గిపోయినప్పటికీ... లాక్‌డౌన్ అనంతరం మళ్లీ పెరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పొల్యూషన్ సర్టిఫికెట్ నిబంధనను తప్పనిసరి చేసింది.
ఇదీ చూడండి: లారీ ఢీకొని నుజ్జునుజ్జయిన కారు- నవదంపతులు మృతి