తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పల్లె పోరు: మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. - ap panchayat elections final phase news

ఏపీలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీవ్యాప్తంగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు 66.60 శాతం పోలింగ్​ నమోదైంది. ఇప్పటివరకు విజయనగరం జిల్లాలో అత్యధికంగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ap local body polls
ఏపీ పల్లె పోరు: మధ్యాహ్నం 12.30 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..

By

Published : Feb 21, 2021, 1:43 PM IST

ఏపీవ్యాప్తంగా నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ జోరందుకుంటోది. మధ్యాహ్నం 12.30 గంటల వరకు 66.60 శాతంగా నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 77.20 శాతంగా ఉండగా... అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 61.62 శాతంగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

జిల్లాల వారీగా...

శ్రీకాకుళంలో 62.07, విజయనగరంలో 77.20, విశాఖ 73.30, తూర్పు గోదావరి జిల్లా 64.04, పశ్చిమ గోదావరి జిల్లా 63.29, కృష్ణా 62.82, గుంటూరు 62.87, ప్రకాశంలో జిల్లాలో 61.79 శాతం నమోదైంది. నెల్లూరులో 61.62 శాతం పోలింగ్‌ నమోదు కాగా... చిత్తూరులో 66.62, కడపలో 69.93, కర్నూలులో 68.62, అనంతపురంలో 71.65 శాతం పోలింగ్‌ నమోదైనట్లు తెలిపారు.

పోలింగ్​ శాతం

ఇవీచూడండి:ఎల్​డీఎఫ్ వ్యూహంతో తమిళనాట కమల్ పోరు

ABOUT THE AUTHOR

...view details