తెలంగాణ

telangana

ETV Bharat / city

పోటీలో విత్​డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు.. పోలింగ్ వాయిదా - అంటిపేటలో ఎంపీటీసీ స్థానానికి రీపోలింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్​ విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో.. ఎంపీటీసీ స్థానానికి పోటీలో ఉన్న అభ్యర్థి పేరుకు బదులుగా.. విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ముద్రించారు. దీంతో అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. బ్యాలెట్​ పేపరులో పేరు తప్పుగా ముద్రించటంతో.. రేపు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు.. జిల్లా కలెక్టర్ జరిజవహర్ లాల్ తెలిపారు.

postponed
పోటీలో విత్​డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు.. పోలింగ్ వాయిదా

By

Published : Apr 8, 2021, 10:14 AM IST

ఆంధ్రప్రదేశ్​ విజయనగరం జిల్లా సీతానగరం మండలం అంటిపేటలో.. ఎంపీటీసీ స్థానానికి పోలింగ్ ఆగిపోయింది. బ్యాలెట్‌ పేపర్‌లో తప్పులతో పోలింగ్‌ రేపటికి వాయిదా పడింది. పోటీలో ఉన్న అభ్యర్థి పేరుకు బదులుగా.. విత్‌డ్రా చేసుకున్న అభ్యర్థి పేరు ముద్రణ అయింది. వైకాపా అభ్యర్థి ఎస్‌.నిర్మల పేరు బదులుగా.. బ్యాలెట్‌ పేపరులో విత్​డ్రా చేసుకున్న ఎస్‌.లక్ష్మి పేరు ముద్రించటంతో.. పోలింగ్ నిలిచిపోయింది.

రేపు రీపోలింగ్ నిర్వహణ: కలెక్టర్

అంటిపేట ఎంపీటీసీ స్థానానికి రేపు రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ హరిజవహర్ లాల్ తెలిపారు. బ్యాలెట్ పత్రంలో అభ్యర్థి పేరు తప్పుగా నమోదు కావడంతో రీపోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు. ఈ మేరకు 20, 21, 22 పోలింగ్‌ కేంద్రాల్లో వాయిదా వేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

ఇవీ చూడండి: 'అత్యవసరమైతేనే బయటకి రండి.. కరోనా వస్తే బెడ్లు దొరకవు'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details