తెలంగాణ

telangana

ETV Bharat / city

గత ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన జీహెచ్ఎంసీ పోలింగ్ - జీహెచ్ఎంసీ గత ఎన్నికలతో పోలిక

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఎప్పుడూ 50శాతం కంటే తక్కువ పోలింగ్​ నమోదవుతోంది. 2016 ఎన్నికలతో పోలిస్తే 1.28శాతం పెరిగనప్పటికీ... 50శాతాన్ని దాటలేదు. కేవలం మూడు డివిజన్లలో మాత్రమే 60శాతానికిపైగా పోలింగ్​ నమోదైంది.

polling comparison with before elections in greater hyderabad
గత ఎన్నికల కంటే స్వల్పంగా పెరిగిన జీహెచ్ఎంసీ పోలింగ్

By

Published : Dec 2, 2020, 7:44 PM IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం స్వల్పంగా పెరిగింది. 2016లో 45.29 శాతం నమోదు కాగా... తాజా ఎన్నికల్లో 1.28 శాతం పెరిగి 46.55గా నమోదైంది. మూడు డివిజన్లలో అరవై శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా... 36 డివిజన్లలో యాభై నుంచి అరవైశాతం ఓటింగ్ జరిగింది.

94 డివిజన్లలో నలభై నుంచి యాభై శాతం పోలింగ్ నమోదైంది. 16 డివిజన్లలో ముప్పై నుంచి నలభై శాతం ఓటింగ్ జరిగింది. 2016లో యాభై శాతానికి పైగా 27 డివిజన్లలో పోలింగ్ కాగా... 99 డివిజన్లలో నలభై నుంచి యాభై శాతం నమోదైంది. ముప్ఫై నుంచి నలభై శాతం ఓటింగ్ 24 డివిజన్లలో జరిగింది.

తాజా ఎన్నికల్లో...

డివిజన్ 2016 2020
ఆర్​సీపురం 58.30 67.71
యూసుఫ్​గూడ 35.92 32.99
ఎర్రగడ్డ 59.16 43.29
విజయ్​నగర్​ కాలనీ 33.98 37.90

ఇదీ చూడండి:గ్రేటర్​లో 46.55శాతం.. ఓల్డ్ మలక్​పేటలో రేపు రీపోలింగ్

ABOUT THE AUTHOR

...view details