తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో కొనసాగుతున్న తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ - తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం వార్తలు

ఏపీలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలో పోలింగ్ జరుగుతోంది. 161 మండలాల్లో నోటిఫికేషన్ ఇచ్చిన 3,229 పంచాయతీలకు గానూ.. ఏకగ్రీవాలు మినహా 2,743 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.

ap elections
ap elections

By

Published : Feb 21, 2021, 7:38 AM IST

ఏపీలో చివరి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6 గంటలకే పలువురు ఓటర్లు కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 3 గంటల 30 నిమిషాల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు.

నాలుగో విడత ఎన్నికలకుగానూ ఏపీలో 28,995 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 3,299 పంచాయతీలకు గానూ 554 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. కడప జిల్లాలో రెండు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాకపోవటంతో మొత్తం 2,743 పంచాయతీల్లో ఎన్నిక జరగనుంది. మొత్తం 67 లక్షల 75 వేల మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

ABOUT THE AUTHOR

...view details