సీఎం కేసీఆర్‌కు గవర్నర్ తమిళిసై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
కేసీఆర్‌కు తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ముఖ్యమంత్రికి మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే విషెష్ చెప్పారు. పచ్చదనాన్ని ప్రేమించే కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. కోటివృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటడమే కేసీఆర్‌కు మనమిచ్చే కానుకని చిరంజీవి అన్నారు. అందరం మొక్కలు నాటదాం.. పరిరక్షించే బాధ్యత తీసుకుందామని పేర్కొన్నారు.
సీఎం కేసీఆర్‌కు జనసేన అధినేత పవన్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. తాను అభిమానించే సమకాలీన రాజకీయవేత్తల్లో కేసీఆర్ ఒకరని పవన్ పేర్కొన్నారు. దార్శనికత, ధృడ సంకల్పం కేసీఆర్‌లో పుష్కలంగా ఉంటాయన్నారు. కేసీఆర్ ఆయురారోగ్యాలతో ప్రజలకు సేవలందించాలని ట్వీట్ చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సినీ నటుడు మహేశ్‌బాబు బర్త్‌డే విషెష్ చెప్పారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, ప్రముఖులకు సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమ, ఆదరాభిమానాలు కలకాలం కొనసాగాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.