ఆంధ్రప్రదేశ్ వికేంద్రీకరణతోపాటు సీఆర్‌డీఏ రద్దు బిల్లు సెలెక్ట్ కమిటీ ముందుకు రావడంతో.. అందులో ఉండే సభ్యులపై పార్టీలు స్పష్టత ఇచ్చాయి. వికేంద్రకరణ బిల్లు పరిశీలన కోసం సెలెక్ట్ కమిటీలో ప్రధాన ప్రతిపక్షం తెదేపా నుంచి ఐదుగురి పేర్లు ఖరారు చేశారు. నారా లోకేశ్, అశోక్‌బాబు, తిప్పేస్వామి, బీటీ నాయుడు, సంధ్యారాణి తెలుగుదేశం నుంచి సెలెక్ట్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. భాజపా కూడా తమ పార్టీ తరఫున మాధవ్ పేరును సూచించింది. పీడీఎఫ్ నుంచి కేఎస్ లక్ష్మణరావు కమిటీలో సభ్యులుగా ఉంటారు.
సెలక్ట్ కమిటీకి పార్టీల నుంచి సభ్యుల పేర్లు ఖరారు!
మూడు రాజధానులు, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను ఏపీ శాసన మండలి ఛైర్మన్ సెలక్ట్ కమిటీలకు పంపిన నేపథ్యంలో ఆయా కమిటీల్లో ఉండాల్సిన నేతల జాబితాను పార్టీలు పంపించాయి. తెదేపా, భాజపా, పీడీఎఫ్ నుంచి మండలి ఛైర్మన్ కార్యాలయానికి ఈ జాబితాలు చేరాయి.
select committee
సీఆర్‌డీఏ రద్దు బిల్లును పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీలో తెలుగుదేశం నుంచి దీపక్‌రెడ్డి, బచ్చుల అర్జునుడు, బుద్ధా వెంకన్న, బీదా రవిచంద్ర, గౌనువారి శ్రీనివాసులు సభ్యులుగా ఉంటారు. భాజపా నుంచి సోము వీర్రాజు, పీడీఎఫ్ నుంచి ఇళ్ల వెంకటేశ్వరరావు పేర్లను ఆయా పార్టీలు ప్రకటించాయి. వైకాపా నుంచి ఇంతవరకు ఎలాంటి జాబితా అందలేదని తెలుస్తోంది.
ఇదీ చూడండి:సెలెక్ట్ కమిటీకి ఏపీ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు