pv narasimha rao jayanthi : నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి, బహుభాషాకోవిదుడైన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 101వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ సమాధి జ్ఞాన భూమి వద్ద మంత్రులు, పార్టీల నేతలు నివాళి అర్పించి... ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. దేశం, మాతృభాష అభివృద్ధికి పీవీ నరసింహారావు విశేష కృషి చేశారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన పీవీని మోదీ సర్కార్.... ప్రత్యేకంగా గౌరవిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ఆయన.... దివంగత నేత సేవలను గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల సమయంలోని పీవీ గుర్తుకొస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు.
pv jayanthi : ఆర్థిక సంస్కరణలకు బీజం వేసిన పీవీని మోదీ సర్కార్.... ప్రత్యేకంగా గౌరవిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. పీవీ ఘాట్ వద్ద నివాళి అర్పించిన ఆయన.... దివంగత నేత సేవలను గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రజలు గర్వపడే వ్యక్తి పీవీ నర్సింహారావు అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని తరఫున ఘన నివాళులర్పించారు. దిల్లీలో పీవీ స్మృతి మందిర్ నిర్మిస్తామని తెలిపారు. పీఎం మ్యూజియంలో పీవీ జ్ఞాపకాలు ఏర్పాటు చేశామన్న కిషన్ రెడ్డి.. పీవీ చరిత్ర తెలిసేలా పుస్తకాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. పీవీ గొప్పతనాన్ని తెలిపేలా తపాలా బిళ్ల విడుదల చేస్తామని కిషన్ రెడ్డి వెల్లడించారు.