ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వివిధ పార్టీల నేతలు మండిపడ్డారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో నిరాహార దీక్ష చేస్తున్న సీపీఐ నేత కూనంనేని సాంబశివరావును తెజస అధ్యక్షుడు కోదండరాం, తెతెదేపా నేతలు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత వీ. హనుమంతరావు, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి, మందకృష్ణ మాదిగ తదితరులు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను తెలుసుకున్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం దీక్ష చేస్తున్న కూనంనేని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని విమర్శించారు. ఆయనకు ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోందని, వెంటనే ఆ సంస్థకు రావాల్సిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
నిమ్స్‌లో కూనంనేనిని పరామర్శించిన నేతలు - నిమ్స్‌లో కూనంనేనిని పరామర్శించిన చాడ వెంకటరెడ్డి
హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కూనంనేని సాంబశివరావును వివిధ పార్టీల నేతలు పరామర్శించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా సీఎం కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు.

నిమ్స్‌లో కూనంనేనిని పరామర్శించిన నేతలు