తెలంగాణ

telangana

ETV Bharat / city

ఆస్పత్రుల్లో జనాలు.. ఆటవిడుపులో నేతలు! - గుర్రపు స్వారీ చేసిన ప్రభుత్వ విప్ శ్రీకాంత్ రెడ్డి వార్తలు

ఓ వైపు కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఆసుపత్రుల్లో పడకలు దొరక్క.. ఆక్సిజన్ అందుబాటులో లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వారి వెన్నంటే ఉండి ధైర్యం చెప్పాల్సింది.. వారి సమస్యలు తీర్చాల్సింది.. స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులే..! కానీ ఏపీలోని కడప జిల్లా నేతలు ఏం చేశారో తెలుసా..? సరదాగా గుర్రపు స్వారీ చేశారు. అవును నిజమే... కావాలంటే ఈ వీడియో చూడండి.. !

గుర్రపు స్వారీలు చేసిన కడప జిల్లా వైకాపా నేతలు
గుర్రపు స్వారీలు చేసిన కడప జిల్లా వైకాపా నేతలు

By

Published : May 10, 2021, 9:16 PM IST

Updated : May 11, 2021, 10:18 AM IST

గుర్రపు స్వారీలు చేసిన కడప జిల్లా వైకాపా నేతలు

ప్రజలు కరోనాతో అల్లాడుతున్న వేళ... కడప జిల్లాలో కొందరు ప్రజాప్రతినిధులు గుర్రపుస్వారీ చేయడం విమర్శలకు తావిచ్చింది. కడప జిల్లా రాజంపేట మండలం ఆకేపాడులో ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబులు సమావేశమైన సందర్భంలో ఇది జరిగింది. ఆకేపాడులో సమావేశమైన నేతలు కడప జిల్లాలో కరోనా తీవ్రతపై చర్చించారు.

ఏపీ ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్నో చర్యలు చేపడుతోందని నేతలు తెలిపారు. కానీ.. ప్రజల్లో చైతన్యం లేకపోవడం వల్లే కరోనా కేసులు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రజలు మాస్కులు ధరించి, శానిటైజర్ ఉపయోగిస్తూ.. భౌతిక దూరం పాటించడం వల్లే కరోనా నియంత్రణ సాధ్యమన్నారు. ప్రజల్లో చైతన్యంతోనే కరోనా కట్టడి జరుగుతుందని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు.

అంతవరకూ బాగానే ఉంది...కానీ ఆ తర్వాత నేతలు.. ఆటవిడుపుగా గుర్రపుస్వారీ చేయడం విమర్శలకు తావిచ్చింది. కడప మేయర్ సురేష్ బాబు, విప్ కోరుముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి చెయ్యేరు నదిలో గుర్రపుస్వారీ చేశారు.

ఇవీచూడండి:ఏపీ అంబులెన్సులకు నో ఎంట్రీ... రాష్ట్ర సరిహద్దులో ఆందోళనకర పరిస్థితి

Last Updated : May 11, 2021, 10:18 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details