ఎస్‌ఈబీ, పోలీసు ఉన్నతాధికారులతో ఏపీ డీజీపీ సమావేశమయ్యారు. మాదకద్రవ్యాల నిర్మూలనపై పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని డీజీపీ వివరించారు. డ్రగ్స్ నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రత్యేక కార్యదళం ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. 24 గంటలూ పనిచేసేలా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఉంటాయన్న డీజీపీ... డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై పీడీ చట్టం నమోదు చేస్తామని హెచ్చరించారు.
'మాదకద్రవ్యాల నిర్మూలనకు ఏపీ పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు' - DGP Sawang comments on Drug Eradication
డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై పీడీ చట్టం నమోదు చేస్తామని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై పోలీసుశాఖ ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. 24 గంటలూ పనిచేసేలా రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.
డ్రగ్స్ నిర్మూలనకు క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని సవాంగ్ తెలిపారు. లఘుచిత్రాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. డ్రగ్స్ నిర్మూలన దిశగా ప్రత్యేక టోల్ ఫ్రీ, వాట్సాప్ నంబర్లు కేటాయిస్తున్నట్టు వెల్లడించారు. వివిధ శాఖల సమన్వయంతో దాడులు నిర్వహించాలని ఆదేశించారు. మత్తుకు బానిసలైన విద్యార్థులపై ప్రత్యేక నిఘా ఉంచాలని స్పష్టం చేశారు. డ్రగ్స్‌పై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. డ్రగ్స్ బానిసలను డి-అడిక్షన్ కేంద్రాలకు పంపాలని సూచించారు.
ఇవీచూడండి:కరోనా దృష్ట్యా ఇంటర్ కళాశాలలు మూసివేత