తెలంగాణ

telangana

ETV Bharat / city

సీఎం కాన్వాయ్ కోసం కారు ఇవ్వాల్సిందే.. పోలీసుల ఓవరాక్షన్

Ongole Police Over action : ఓ వ్యక్తి తన కుటుంబంతో కలిసి ఇన్నోవా కారులో తిరుపతికి బయలుదేరాడు. మార్గమధ్యంలో అల్పాహారం కోసం ఓ హోటల్ వద్ద దిగారు. అంతలో ఓ కానిస్టేబుల్ వచ్చి కారును తీసుకువెళ్లాడు. కారును ఎందుకు తీసుకువెళ్తున్నారో కూడా వారికి అర్థం కాలేదు. కొద్దిసేపటి తర్వాత మరో పోలీసు వచ్చి అసలు విషయం చెప్పడంతో వారు అవాక్కయ్యారు. ఈ ఘటన ఎక్కడో కాదు ఒంగోలులో జరిగింది.

Ongolu Police Over action
Ongolu Police Over action

By

Published : Apr 21, 2022, 10:16 AM IST

Updated : Apr 21, 2022, 11:29 AM IST

Ongole Police Over action : తిరుపతికి వెళ్లే ప్రయాణికుల కారును ఏపీ ముఖ్యమంత్రి కాన్వాయ్ కోసం పోలీసులు స్వాధీనం చేసుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేముల శ్రీనివాస్‌ తన కుటుంబంతో కలిసి వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఆకలిగా ఉండటంతో బుధవారం రాత్రి సమయంలో ఒంగోలులోని స్థానిక పాత మార్కెట్‌ సెంటరులో వాహనం నిలిపి టిఫిన్‌ చేస్తుండగా ఓ కానిస్టేబుల్‌ అక్కడికి వచ్చారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు పర్యటన నేపథ్యంలో.. కాన్వాయ్‌ కోసం వాహనంతో పాటు డ్రైవర్‌ను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. తాము కుటుంబంతో తిరుమల వెళ్తున్నామని చెప్పినా వినిపించుకోలేదు.

పోలీసుల ఓవరాక్షన్

CM Convoy Issue : ఉన్నతాధికారుల ఆదేశాలు సార్‌.. మీకు సారీ చెప్పడం తప్ప మేమేమీ చేయలేమంటూ కారుతో పాటు డ్రైవర్‌ను తీసుకుని ఆ కానిస్టేబుల్‌ వెళ్లిపోయాడు. సీఎం కాన్వాయ్‌కు వాహనాలు కావాలంటే స్థానికులను అడిగి తీసుకోవాలనీ, దూరప్రాంతాలకు ప్రయాణం చేస్తున్న వారి నుంచి, అందునా మొక్కులు తీర్చుకునేందుకు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్న వారి వాహనాలు లాక్కుని రోడ్డుపాలు చేయడం ఏమిటని వాపోయారు. ఊరుకాని ఊళ్లో తమకు ఇప్పటికిప్పుడు తిరుమల వెళ్లేందుకు వాహనం ఎక్కడ దొరుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్వస్థలానికి వెళ్లేందుకు కూడా వాహనం దొరికే పరిస్థితి లేదని ఆవేదన చెందారు.

ఇవీ చదవండి :

Last Updated : Apr 21, 2022, 11:29 AM IST

ABOUT THE AUTHOR

...view details