తెలంగాణ

telangana

ETV Bharat / city

ఫుడ్​ డెలివరీ బాయ్స్​ కష్టాలు​​... అనుమతులు లేవంటూ వాహనాలు సీజ్

రోజూ ఇంటి వద్దకే ఆహారం తెచ్చిచ్చే డెలివరీ బాయ్స్‌ను పోలీసులు ఇవాళ అడ్డుకున్నారు. అనుమతులు లేవంటూ వారి వాహనాలను సీజ్‌ చేశారు. లాక్‌డౌన్‌ సమయం నుంచి డెలివరీ చేస్తున్నా... ఈరోజు ఎందుకు అనుమతులు ఇవ్వడం లేదని సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. దినసరి వేతనంపై పని చేసుకునే తమను పోలీసుల ఇలా అడ్డుకోవడం వల్ల జీవనోపాధి కొల్పోతున్నామని డెలివరీబాయ్స్​ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

police seized food delivery boys vehicles in hyderabad
police seized food delivery boys vehicles in hyderabad

By

Published : May 22, 2021, 4:35 PM IST

Updated : May 22, 2021, 7:53 PM IST

ఫుడ్​ డెలివరీ బాయ్స్​ కష్టాలు​​... అనుమతులు లేవంటూ వాహనాలు సీజ్

బయట లాక్​డౌన్​ ఉన్నా సరే... ఆర్డర్​ చేస్తే చాలు ఇంటికే భోజనాన్ని సరఫరా చేసే డెలివరీ బాయ్స్​ ఆందోళన చెందుతున్నారు. రెండో దశ లాక్​డౌన్​లో డెలివరీబాయ్స్​కు ప్రభుత్వం మినహాయింపు ఇవ్వగా... నేటి నుంచి అనుమతులు లేవంటూ పోలీసులు ఎక్కడికక్కడే ఆపేస్తున్నారు. వాహనాలను కూడా సీజ్‌ చేస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ఊరుకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్న వారికి, ఆహారం దొరకని వారికి ప్రతి రోజు ఆహారం అందిస్తూ తాము కూడ సేవ చేస్తున్నామని డెలివరీ బాయ్స్​ చెబుతున్నారు. ఇలాంటి సమయంలో పోలీసులు ముందుస్తూ హెచ్చరికలు ఏమీ చేయకుండా అనుమతులు లేవంటూ రోడ్డు మీద వాహనాలను సీజ్‌ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.

వారం రోజులుగా తాము ఆహారం సరఫరా చేస్తున్నామని... ఈరోజు మాత్రమే ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నట్లు డెలివరీ బాయ్స్‌ వాపోతున్నారు. అనుమతులు లేవని తెలిస్తే... తాము ఎందుకు వస్తామంటున్నారు. ఇప్పుడు ఉన్నపళంగా వాహనాలు తీసుకొని సీజ్‌ చేస్తే... ఏం చేయాలని అడుగుతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు ఒకసారి అలోచించి తమ వాహనాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం తమ వాహనాలు ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని అడిగినా పోలీసులు చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు... ఫుడ్​ డెలివరీ కంపెనీలకు ఎలాంటి అనుమతులు లేవని పోలీసులు చెబుతున్నారు. వారం రోజులుగా ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించగా... తమ పై అధికారుల ఆదేశాల మేరకు తాము పని చేస్తున్నామని పోలీసులు దాటేసే సమాధానాలు ఇస్తున్నారు.

ఇదీ చూడండి: సీఎం ఆదేశాలతో రాష్ట్రంలో మరింత కఠినంగా లాక్​డౌన్​ అమలు

Last Updated : May 22, 2021, 7:53 PM IST

ABOUT THE AUTHOR

...view details