అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన తర్వాత తహసీల్దారు కార్యాలయాల వద్ద అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. రెవెన్యూ ఐకాస వినతి మేరకు.. ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోనుంది.
ఎప్పుడు పడితే అప్పుడు కలవరిక
గతంలో జరిగినట్లు.. ఇకపై ఎప్పుడు పడితే అప్పుడు తహసీల్దారును కలవడం సాధ్యం కాదు. ఫిర్యాదుల కోసం ప్రత్యేక సమయం కేటాయించాలని భూపరిపాలన శాఖ కమిషనర్ అధికారులను ఆదేశించారు. కార్యాలయానికి వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేయాలని సూచించారు.
లోపల, బయట - సీసీ నిఘా
గ్రీవెన్స్ డే రోజు వినతులు, ఫిర్యాదులు తీసుకునేందుకు కార్యాలయం సిబ్బంది అందరూ హాజరుకావాలని ఆదేశించారు. ప్రధానంగా ఉద్యోగుల భద్రత దృష్ట్యా కార్యాలయం ఆవరణతోపాటు.. లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.
చట్టాలపై - ప్రత్యేక శిక్షణ
పాత కార్యాలయాలతోపాటు కొత్తగా మండలాలు ఏర్పాటైన చోట ప్రభుత్వం కనీస వసతులతోపాటు అధికారులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయనుంది. రెవెన్యూ సిబ్బందికి, అధికారులకు జిల్లా కేంద్రాల్లో ముఖ్యమైన చట్టాలపై అవగాహన కల్పించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని భూ పరిపాలనశాఖ ఆదేశించింది. మెజిస్ట్రేట్ అధికారాలు ప్రతిబింబించేలా ప్రత్యేక నిర్మాణాలు ఏర్పాటుచేయనుంది.
ఆదేశాలివే...
- జిల్లాల్లోని రెవెన్యూ కార్యాలయాలన్నింటికీ పోలీసు భద్రత ఏర్పాటు చేయాలి.
- గ్రీవెన్స్ డే రోజు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు తీసుకునే సమయంలో కార్యాలయ సిబ్బంది అందరూ హాజరుకావాలి.
- తహసీల్ కార్యాలయాల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు ప్రత్యేకమైన మార్గాలు ఏర్పాటు చేయాలి.
- ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేక సమయం కేటాయించాలి.
- పాత కార్యాలయాలతోపాటు కొత్తగా మండలాలు ఏర్పాటైన చోట కనీస వసతులు కల్పించాలి. అధికారులకు ప్రత్యేక గదుల ఏర్పాటు, వసతులు పెంపొందించాలి.
- మెజిస్ట్రేÆట్ అధికారాలు ప్రతిబింబించేలా కోర్టు గది, అధికారుల కార్యాలయంలో ప్రత్యేకమైన నిర్మాణాలు ఉండాలి.
- కార్యాలయ ఆవరణతో పాటు లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- రెవెన్యూ సిబ్బందికి, అధికారులకు జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి.
ఇదీ చదవండి: కేంద్రం అనుమతులు తీసుకోవాల్సిందే: హైకోర్టు