తెలంగాణ

telangana

ETV Bharat / city

బావిలో పడిన వృద్ధురాలిని రక్షించిన పోలీసులు - దువ్వూరులో ప్రమాదవశాత్తు బావిలో పడ్డ వృద్ధురాలు

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడిపోయిన 70 ఏళ్ల వృద్ధురాలిని పోలీసులు కాపాడారు. ఈ ఘటన ఏపీలోని కడప జిల్లా దువ్వూరు మండలంలో జరిగింది. గాయపడిన వెంకటమ్మను చికిత్స నిమిత్తం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

police rescued old women
బావిలో పడిన వృద్ధురాలిని రక్షించిన పోలీసులు

By

Published : May 19, 2021, 7:01 PM IST

ఏపీలోని కడప జిల్లా దువ్వూరు మండలం ఇందిరమ్మ కాలనీలోని పాడుబడ్డ బావిలో 70 ఏళ్ల వృద్ధురాలు వెంకటమ్మ ప్రమాదవశాత్తు పడిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు.. స్థానికుల సాయంతో ఆమెను బయటకు తీశారు.

బావిలో వృద్దురాలు పడిపోయి ఉండటాన్ని ఒక మేకల పెంపకందారుడు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే ఎస్సైతో సహా సిబ్బంది బావి వద్దకు చేరుకున్నారు. మెట్లులేని 30 అడుగుల ఏటవాలుగా ఉన్న బావిలోకి తాళ్ల సహాయంతో దిగారు. అతికష్టం మీద వృద్ధురాలిని బయటకు తీసుకువచ్చారు. గాయపడిన వృద్ధురాలిని చికిత్స కోసం 108లో ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి:లాక్​డౌన్​ 2.0: లక్ష కుటుంబాలపై తీవ్ర ప్రభావం

ABOUT THE AUTHOR

...view details