తెలంగాణ

telangana

ETV Bharat / city

నాగరాజు హత్య కేసు నిందితుల కస్టడీ కోరుతూ పిటిషన్ - సరూర్‌నగర్ పరువు హత్య కేసు అప్‌డేట్స్

Saroornagar Honor Killing News : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సరూర్‌నగర్ పరువు హత్య కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్యకు సంబంధించి మరికొంత సమాచారాం సేకరించాల్సి ఉందని.. 7 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Saroornagar Honor Killing News
Saroornagar Honor Killing News

By

Published : May 9, 2022, 1:18 PM IST

Saroornagar Honor Killing News : సరూర్‌నగర్ పరువు హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. నాగరాజును అతికిరాతకంగా హత్య చేసిన నిందితుల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు ఏడు రోజుల పాటు వారి కస్టడీ కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హత్య జరిగిన సమయంలో ఎంత మంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Saroornagar Honor Killing Latest News : ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరిలో ప్రధాన నిందితుడు.. బాధితురాలి సోదరుడు మోబిన్‌తో పాటు అతని సమీప బంధువును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్య జరిగినప్పుడు ఘటనాస్థలిలో ఐదుగురు ఉన్నారని.. మృతుడు నాగరాజు భార్య ఆశ్రిన్ సుల్తానా పోలీసులకు తెలిపారు. మిగతా ముగ్గురు ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. నాగరాజు కదలికలు తెలుసుకునేందుకు నిందితులు మొబైల్ ట్రాకర్‌ అప్లికేషన్ వినియోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Ashrin Sulthana Latest News : నాగరాజు మొబైల్‌లో ఎవరు ట్రాకర్‌ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుంటారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రధాన నిందితుడు మోబిన్ స్నేహితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇద్దరు నిందితుల నుంచి మరికొంత సమాచారం సేకరించాల్సి ఉన్నందున ఏడు రోజుల పాటు వారిని కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details