తెలంగాణ

telangana

ETV Bharat / city

కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష 'కీ' విడుదల - తెలంగాణ పోలీస్ రిక్రూట్​మెంట్ ఎగ్జామ్

constable exam key release రెండురోజుల క్రితం నిర్వహించిన కానిస్టేబుల్ ప్రాథమిక పరీక్ష 'కీ'ని అధికారులు విడుదల చేశారు. వీటిలో అభ్యంతరాలుంటే తగిన ఫార్మాట్​లో పంపాలని అభ్యర్థులకు సూచించారు. సుమారు 16వేల కానిస్టేబుల్ పోస్టులకు 6లక్షలకు పైగా అభ్యర్థులు పోటీ పడ్డారు.

constable exam key release
constable exam key release

By

Published : Aug 30, 2022, 10:05 PM IST

constable exam key release: కానిస్టేబుల్ రాతపరీక్ష ప్రాథమిక పరీక్ష 'కీ' విడుదలైంది. పోలీస్ నియామక మండలి వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. కీ పేపర్​పై అభ్యంతరాలుంటే తగిన ఆధారాలతో వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేయాలని పోలీస్ నియామక మండలి అధికారులు సూచించారు. ఒక్కో ప్రశ్నకు తగిన ఆధారాన్ని పీడీఎఫ్ లేదా జేపీజీ ఫార్మాట్‌లో అప్ లోడ్ చేయాలని సూచించారు. 15 వేల 644 పోలీస్ కానిస్టేబుల్, 614 ఆబ్కారీ, రవాణా శాఖలోని 63 కానిస్టేబుళ్లకు ఈ నెల 28న రాత పరీక్ష నిర్వహించారు.

6లక్షల మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయని వచ్చిన వార్తలను పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు ఖండించారు. ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లాయని వచ్చిన వార్తలను పోలీస్ నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాస్ రావు ఖండించారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలను నమ్మొద్దని సూచించారు. నిపుణులతో రూపొందించిన కీ పేపర్​ను అందుబాటులో ఉంచారు. వాటిలో ఏమైనా అభ్యంతరాలుంటే ఆధారాలతో సహా చూపిస్తే... వాటిని తిరిగి నిపుణులతో చర్చించిన తర్వాత ఏమైనా తప్పులున్నట్లు నిర్దారించిన తర్వాత సదరు ప్రశ్నకు మార్కులు కలుపుతారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details