తెలంగాణ

telangana

ETV Bharat / city

మంత్రి హత్యకు కుట్ర కేసు.. కస్టడీ పిటిషన్ వేసిన పోలీసులు - మంత్రి హత్యకు కుట్ర కేసు

Srinivas Goud Murder Plan Case: మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ హత్యకు కుట్ర కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పలు అంశాలపై వివరాలు రాబట్టేందుకు 12 మంది నిందితుల్లో ఏడుగురిని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని మేడ్చల్​ జిల్లా కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. తుపాకులు ఎక్కడ కొన్నారు..? సుపారీ డబ్బులు ఎలా సమకూర్చుకోవాలనుకున్నారు..? అని విషయాలపై విచారణ చేయాలని పిటిషన్​లో తెలిపారు.

Police petition for 10 days custody of the accused in Srinivas Goud Murder Plan Case:
Police petition for 10 days custody of the accused in Srinivas Goud Murder Plan Case:

By

Published : Mar 5, 2022, 3:14 PM IST

Updated : Mar 5, 2022, 3:40 PM IST

Srinivas Goud Murder Plan Case: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో నిందితులను 10 రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్​ను మేడ్చల్ జిల్లా న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. కౌంటర్ దాఖలు చేయాలని నిందితుల తరఫు న్యాయవాదికి నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేసిన తర్వాత ఈ కేసుపై వాదనలు జరిగే అవకాశం ఉంది.

ఈ కేసులో ఏడుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని పేట్ బషీరాబాద్ పోలీసులు కోరారు. నిందితులు తుపాకులను ఎక్కడ కొనుగోలు చేసిన విషయం తెలుసుకోవాల్సి ఉందని.. 15కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలని అనుకున్నారనేది ప్రశ్నించాల్సి ఉందని పోలీసులు పిటిషన్​లో పేర్కొన్నారు.

జితేందర్ రెడ్డి పీఏ రాజు.. పోలీసుల ఎదుట సోమవారం హాజరయ్యే అవకాశం ఉంది. రాజుకు రెండు రోజుల క్రితం పోలీసులు నోటీసులు జారీ చేశారు. తన భార్య అనారోగ్యం కారణంగా వెంటనే రాలేనని... పోలీసులకు రాజు తెలిపారు. రాజు సోమవారం వస్తే అతడి నుంచి నిందితులకు సంబంధించిన వివరాలను పోలీసులు తెలుసుకునే అవకాశం ఉంది.

ఈ కుట్ర కేసులో నిందితులైన రాఘవేందర్ రాజు, మధుసూదన్ రాజు, మున్నూరు రవిని దిల్లీలో ఉన్న జితేందర్ రెడ్డి అతిథిగృహంలో ఎస్ఓటీ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతిథిగృహానికి ముగ్గురు నిందితులు ఎందుకు వచ్చారు..? ఈ హత్య కుట్ర విషయం ముందుగానే తెలుసా..? అనే విషయాన్ని రాజు నుంచి తెలుసుకునే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:

Last Updated : Mar 5, 2022, 3:40 PM IST

ABOUT THE AUTHOR

...view details