తెలంగాణ

telangana

ETV Bharat / city

ముదిగొండ ఎస్సైపై వేటు.. ఏఆర్ హెడ్ క్వార్టర్స్​కు అటాచ్​ - khammam dist news

ఖమ్మం జిల్లా ముదిగొండలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్సై ప్రతాపం చూపించిన ఘటన సర్వత్రా విమర్శలకు దారి తీసింది. ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉన్నతాధికారులు ఏఆర్ హెడ్ క్వార్టర్స్​కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

mudigonda police
ముదిగొండ ఎస్సైపై వేటు

By

Published : Mar 31, 2020, 7:57 PM IST

Updated : Mar 31, 2020, 10:05 PM IST

ముదిగొండ ఎస్సైపై వేటు పడింది. పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని బాధ్యత రహితంగా వ్యవహరించడంపై పోలీస్ కమిషనర్ స్పందించారు. ఎస్సై సతీశ్​ కుమార్​ను ఏఆర్ హెడ్ క్వార్టర్స్ అటాచ్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి నివేదిక అందజేయాలని ఖమ్మం రూరల్ ఏసీపీని ఆదేశించారు.

ఈనెల 28న ముదిగొండ పీఎస్​ పరిధిలోని వనవారి కృష్టాపురం గ్రామంలో పేకాట అడుతున్నారనే సమాచారంతో ఎస్సై సతీశ్​ కుమార్ తన సిబ్బందితో దాడులు నిర్వహించారు. పేకాట అడుతున్న వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనితోపాటు బాధ్యత రహితంగా వ్యవహరించిన తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది.

ఇవీ చూడండి:ఆపరేషన్​ నిజాముద్దీన్​: ఆ 157 మంది ఎక్కడ?

Last Updated : Mar 31, 2020, 10:05 PM IST

ABOUT THE AUTHOR

...view details