తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రజలకు మరింత చేరువై మన్ననలు పొందాలి: డీజీపీ - new year celebrations news

పోలీసు ఉన్నతాధికారులు నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. హైదరాబాద్​లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డీజీపీ మహేందర్​రెడ్డి కేక్​ కట్​ చేశారు. ఈ వేడుకలకు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

police officers celebrated new year in hyderabad
police officers celebrated new year in hyderabad

By

Published : Jan 1, 2021, 3:26 PM IST

హైదరాబాద్​లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ ఆవరణలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి కేక్ కట్ చేశారు. అవినీతి నిరోధక శాఖ డీజీ పూర్ణచంద్రరావు, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్, శాంతి భధ్రతల అదనపు డీజీ జితేందర్​తో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పుష్పగుచ్ఛంతో డీజీపీకి స్వాగతం...
వేడుకల్లో సీపీ అంజనీ కుమార్​...
కేక్​ కట్​ చేస్తూ...

పోలీసు సిబ్బందికి డీజీపీ మహేందర్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులు ప్రజలకు మరింత చేరువై... మన్ననలు పొందాలని డీజీపీ ఆకాంక్షించారు.

వేడుకల్లో పోలీసు ఉన్నతాధికారులు
కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులు...

ఇదీ చూడండి: టాలీవుడ్ స్టార్స్.. అభిమానులకు 'న్యూ ఇయర్​' విషెస్​

ABOUT THE AUTHOR

...view details