కడప జిల్లా ప్రొద్దుటూరులో హత్యకు గురైన సుబ్బయ్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హత్య కేసులో పోలీసులు కొత్తగా ముగ్గురు పేర్లు చేర్చారు. వీరిలో ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, బంగారు రెడ్డితో పాటు మున్సిపల్ కమిషనర్ రాధ పేర్లు ఉన్నాయి. సుబ్బయ్య భార్య అపరాజిత నుంచి సెక్షన్ 161 ప్రకారం వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె ఇచ్చిన వాంగ్మూలాన్ని కోర్టుకు సమర్పించనున్నారు.
లోకేశ్ ధర్నా.. హామీ ఇచ్చిన డీఎస్పీ
సుబ్బయ్య మృతదేహానికి నివాళులర్పించిన నారా లోకేశ్.. కుటుంబసభ్యులను పరామర్శించారు. నిందితులను శిక్షించాలంటూ రోడ్డుపై బైఠాయించారు. రంగంలోకి దిగిన డీఎస్పీ లోకేశ్‌తో చర్చలు జరిపారు. 15 రోజుల్లో విచారణ వేగవంతం చేసి నిందితులకు కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటామని భార్య అపరాజితకు హామీ ఇచ్చారు.