ఆంధ్రప్రదేశ్లో తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి కేసులో.. నిందితుల్లో కొందరిని విజయవాడ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఆదిత్య సూచన మేరకే తాము పట్టాభిపై దాడి చేశామని పట్టుబడిన నిందితులు పోలీసులకు తెలిపారు. అరెస్టయిన వారిలో విజయవాడ గుణదల ప్రాంతానికి చెందిన శ్రవణం ఆనంద్, అద్దంకి వెంకటేశ్, పిరిడి భాగ్యరాజు, పొట్నూరి భాస్కరరావు, వెంకట సత్యనారాయణ, ధర్మవరపు తులసీరామ్ ఉన్నారు. వారికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆదిత్యతో తమకున్న పరిచయంతో వివరాలు తెలుసుకోకుండానే దాడి చేసినట్లు నిందితులు విచారణలో వెల్లడించారు. ఇంతకీ ఆదిత్య ఎవరు? ఆయనకు పట్టాభితో వైరమేంటి? అన్నది మిస్టరీగానే ఉంది. దాడిలో 10 మంది పాల్గొన్నట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.
పట్టాభిపై దాడి కేసు: ఆయన చేబితేనే చేశాం - ఏపీ తాజా వార్తలు
ఏపీ తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిపై దాడి ఘటనలో నిందితులను సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఆరుగురిని అరెస్ట్ చేసి విచారణ జరపగా.. ఆదిత్య అనే వ్యక్తి తమను పురమాయించాడని చెప్పినట్లు కోర్టుకు తెలిపారు. సూత్రధారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
పట్టాభిపై దాడి కేసు: ఆయన చేబితేనే చేశాం
క్రికెట్ మైదానంలో ఏడాదిగా ఆదిత్యతో పరిచయం ఉందని నిందితులు తెలిపినట్లు పోలీసులు చెప్పారు. ఓ వ్యక్తిని బెదిరించాలని తమను పిలిచాడని విచారణలో ఒప్పుకున్నారన్నారు. 3434 నెంబర్ కారు వస్తుంది.. అందులో వ్యక్తిని బెదిరించాలని అతడు తమతో చెప్పాడన్నారు. కారులో పట్టాభిని చూడగానే ఆయనతో పరిచయమున్న కొందరు పారిపోయినట్లు తెలిపారు. ఇప్పటివరకు దాడికి గల కారణాలు తెలియలేదని పోలీసులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:మన్యంలో మృత్యుఘోష.. అసోదాలో ఆదివాసీల క'న్నీటి' వ్యథ