తెలంగాణ

telangana

ETV Bharat / city

11 గంటలపాటు పీవీపీ విచారణ.. నేడు మరోసారి పోలీసుల ముందుకు - PVP CASE UPDATES

హైదరాబాద్​ బంజారాహిల్స్​లో విల్లా యజమానిని బెదిరించిన కేసులో వైకాపా నేత, సినీ నిర్మాత పీవీపీని బుధవారం సుమారు 11 గంటలపాటు పోలీసులు విచారించారు. మరోసారి హాజరవ్వాలంటూ 41 సీఆర్​పీసీ కింద నోటీసులు అందజేశారు. పొట్లూరి వరప్రసాద్‌ను నేడు మరోసారి పోలీసుల ఎదుట హాజరుకానున్నారు.

PVP
11 గంటలపాటు పీవీపీ విచారణ.. నేడు మరోసారి పోలీసుల ముందుకు

By

Published : Jun 25, 2020, 12:27 AM IST

విల్లా యజమానిని బెదిరించిన కేసులో వైకాపా నేత, వ్యాపారవేత్త, సినీ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు సుమారు 11 గంటల పాటు విచారించారు. తన అనుచరులతో కలిసి పీవీపీ బెదిరించినట్టు విల్లా యజమాని విక్రమ్‌ కైలాష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పీవీపీతో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం 11.30 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు పీవీపీని పోలీసులు విచారించారు. గురువారం మరోసారి విచారణకు హాజరు కావాలని 41 సీఆర్​పీసీ కింద నోటీసులు అందజేశారు. గురువారం ఉదయం పోలీసుల ఎదుట మరోసారి పీవీపీ హాజరు కానున్నారు.

ABOUT THE AUTHOR

...view details