BJP Rally at Nandamuru cross road : ఆంధ్రప్రదేశ్ గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఇతర నేతలను పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. గన్నవరం సమీపంలోని నందమూరు అడ్డరోడ్డు వద్ద భాజపా నేతల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ పరిస్థితుల్లో వాహనాలు దిగిన సోము వీర్రాజు, సీఎం రమేశ్ సహా ఇతర నేతలు.. గుడివాడకు నడిచి వెళ్లేందుకు యత్నించారు. అందుకు వీల్లేదని పోలీసులు అడ్డగించడంతో.. భాజపా నేతలు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.
BJP Rally at Nandamuru cross road: ఉద్రిక్తత.. భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు - BJP Rally at Nandamuru cross road
BJP Rally at Nandamuru cross road : ఏపీలోని నందమూరు అడ్డరోడ్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుడివాడలో సంక్రాంతి ముగింపు సంబరాలకు వెళుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు సహా ఇతర నేతలను పోలీసులు అడ్డుకున్నారు. భాజపా నేతలు, పోలీసుల మధ్య తీవ్రస్థాయిలో తోపులాట జరిగింది.
భాజపా నేతలను అడ్డుకున్న పోలీసులు
సంక్రాంతి సంబరాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటంటూ పోలీసులతో సోము వీర్రాజు వాగ్వాదానికి దిగారు. తెలుగు సంస్కృతిని దెబ్బతీస్తూ గుడివాడలో క్యాసినో నిర్వహిస్తున్న కొడాలి నానిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని భాజపా నేతలు డిమాండ్ చేశారు.
ఇదీచదవండి:Corona Effect on TSRTC: టీఎస్ఆర్టీసీకి మరోసారి నష్టాలు తప్పవా..?
Last Updated : Jan 25, 2022, 3:43 PM IST