అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహా పాదయాత్రలో పాల్గొనకుండా ప్రకాశం జిల్లాలో తెదేపా ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం(mla's house arrest at prakasham distrcit) చేశారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మార్టూరులో శాసనసభ్యుడు ఏలూరి సాంబశివరావులను అరెస్టు(mla's house arrest at prakasham distrcit due to maha padayathra) చేశారు.
TDP MLAs House Arrest in AP : మహాపాదయాత్రలో పాల్గొనకుండా తెదేపా ఎమ్మెల్యేల గృహనిర్బంధం - ap news
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలనే డిమాండ్‌తో ఏపీ రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో ఈ యాత్ర జరగనున్న నేపథ్యంలో పాదయాత్రలో పాల్గొనకుండా జిల్లాలోని పలువురు తెదేపా ఎమ్మెల్యేల(TDP MLAs House Arrest in AP)ను పోలీసులు గృహనిర్బంధం చేశారు.
అమరావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌తో రాజధాని రైతులు మహా పాదయాత్ర చేపట్టారు. రైతుల మహాపాదయాత్రకు అన్ని వర్గాల నుంచీ రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. ఇవాళ ప్రకాశం జిల్లాలో మహా పాదయాత్ర సాగనుంది. అయితే.. పాదయాత్రలో పాల్గొనకుండా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
మహా పాదయాత్రకు ఆటాంకం కలిగించేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తున్నట్టుగా తెదేపా ఆరోపిస్తోంది. అయితే.. ప్రకాశం జిల్లాలో ఎన్నికల కోడ్ కారణంగానే ఆంక్షలు విధించామని పోలీసులు చెబుతున్నారు. కొన్ని రోజుల క్రితం పాదయాత్రను ఆపాలని ఎస్పీకి వైకాపా ఎమ్మెల్యే ఫిర్యాదు చేయగా.. తాజాగా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల గృహ నిర్బంధం(mla's house arrest at prakasham distrcit) చేయడంపై తెదేపా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.