Murder Plan to Kill TRS Minister : రాష్ట్ర అబ్కారీ, పర్యాటక, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో ఏడుగురు నిందితుల కస్టడీకి మేడ్చల్ న్యాయస్థానం అనుమతిచ్చింది. చర్లపల్లి జైలులో ఉన్న మహబూబ్‌నగర్‌కు చెందిన నాగరాజు, యాదయ్య, విశ్వనాథ్, అమరేంద్రరాజు, రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, మున్నూర్ రవిని కస్టడీలోకి తీసుకున్నారు. నాలుగు రోజుల పాటు వారిని విచారించనున్నట్లు తెలిపారు.
Police Custody for Accused in Minister Murder : నిందితుల్లో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి డ్రైవర్ థాపాను పోలీసులు అరెస్టు చేయగా.. సొంత పూచీకత్తుపై బెయిల్‌పై విడుదలయ్యాడు. మిగిలిన ఏడుగురు నిందితుల నుంచి మంత్రి హత్య కుట్రకు సంబంధించిన కీలక వివరాలు రాబట్టేందుకు నిందితులను 4 రోజులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ సమయంలో నిందితులపై ఎటువంటి బలప్రయోగం(థర్డ్ డిగ్రీ) చేయకూడదని.. విచారణ ముందు, తరువాత వైద్యపరీక్షలు నిర్వహించాలని, నిందితుల తరఫు న్యాయవాదుల సమక్షంలో విచారణ జరపాలని ఆదేశించింది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ ఉదయం 10 గంటల వరకు నిందితులను పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో విచారణ జరిపేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు రూ.15 కోట్లు ఎవరు సమకూర్చుతామన్నారు?.. ఆయుధాలు ఎక్కడ కొనుగోలు చేశారనే వివరాలను పోలీసులు రాబట్టనున్నారు.