ఏపీలోని విజయవాడలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి 10మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా ఈ పది మందిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం తెలిపింది. వీరిలో గుంటూరుకు చెందిన ఐదుగురు, విజయవాడకు చెందిన ఐదుగురు ఉన్నారు. అరెస్టయిన వారంతా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ అనుచరులుగా గుర్తించారు.
పానుగంటి చైతన్య, పల్లపు మహేష్, పేరూరి అజయ్, శేషగిరి పవన్ కుమార్, అడపాల గణపతి గుంటూరుకు చెందిన వారు కాగా.. షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, లంక అభి నాయుడు విజయవాడకు చెందిన వారు. దాడికి పాల్పడిన ముద్దాయిలను పట్టుకునేందుకు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. అలాగే దాడికి సంబంధించి పూర్తి సీసీ కెమెరా దృశ్యాలను అందించాలని తెదేపా కార్యాలయానికి 91 సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చామన్నారు.
తెదేపా కార్యాలయం నుంచి ఇంకా సీసీ ఫుటేజీ తమకు రాలేదని.. అది అందిన తర్వాత మిగతా ముద్దాయిలను గుర్తించి వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని వివరించారు. దాడిలో పాల్గొన్న వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అర్బన్ ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఎన్టీఆర్ భవన్‌కు నోటీసులు..