ఏపీ మంత్రి బాలినేనిని కలిసిన గుప్తా Subbarao Gupta Attack Case: ఆంధ్రప్రదేశ్ ఒంగోలుకు చెందిన వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తా ఇంటిపై శనివారం రోజున జరిగిన దాడితో పాటు గుంటూరు లాడ్జిలో జరిగిన భౌతిక దాడులపై.. ఒంగోలు వన్ టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. దాడిపై సుబ్బారావు గుప్తా ఫిర్యాదు చేయకపోయినా.. అతనిపై దాడి చేసిన దృశ్యాలు బయటకు రావడంతో సుమోటోగా కేసు ఫైల్ చేశారు. సుబ్బారావు భార్య సుభాషిణిని సోమవారం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ఆమెను ఇంటికి పంపించారు.
గుప్తాకు మతిస్థిమితం లేదు మంత్రి బాలినేని..
Minister Balineni on Subbarao Assault Case :పార్టీపై సుబ్బారావు గుప్తా చేసిన విమర్శల విషయమై దాడి చేసి ఉంటారని.. ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గుప్తాకు మతిస్థిమితం లేదని..ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక తెదేపా నేత దామచర్ల జనార్దన్ ఉండొచ్చని ఆరోపించారు.
దాడుల సంస్కృతికి ముగింపు పలకాలి..
Subbarao Gupta Attack Case Update : అయితే మతిస్థిమితం లేదన్న వ్యాఖ్యల్ని సుబ్బారావు ఖండించారు. తాను బాగానే ఉన్నానని..ఎవరిపైనా కేసు పెట్టే ఉద్దేశం లేదని చెప్పారు. దాడుల సంస్కృతికి తనతోనే ముగింపు పలకాలన్నారు.
దాడిని ఖండించిన తెదేపా, ప్రజాసంఘాలు
Attack on YSRCP leader Subbarao Gupta : సుబ్బారావు గుప్తాపై దాడిని ఆర్యవైశ్య సంఘాలు, వివిధ పార్టీల నేతలు ఖండించారు. వైకాపా నేతలు దాడి దారుణమని..తెదేపా నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. పార్టీలకు అతీతంగా వైశ్యులంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. పాలన విధానం మార్చుకోవాలని సూచించిన సుబ్బారావు గుప్తాపై వైకాపా రౌడీ మూకలు దాడి చేయడం ఏంటని తెదేపా వాణిజ్య విభాగం అధ్యక్షుడు డూండి రాకేష్ ప్రశ్నించారు. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో ఆర్యవైశ్య సంఘాల నాయకులు.. పొట్టి శ్రీరాములు విగ్రహానికి వినతిపత్రం అందించారు. నిందితుల్ని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిద్దలూరులోనూ తెదేపా నాయకులు ఆందోళన చేశారు.
మంత్రి బాలినేనిని కలిసిన గుప్తా..
YSRCP leader Subbarao Gupta Updates : సుబ్బారావు గుప్తా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డిని కలిశారు.. సోమవరాం సాయంత్రం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనపై జరిగిన దాడి అంశాన్ని వివరించిన గుప్తా , అక్కడనుంచి నేరుగా మరికొంత మంది నాయకులతో కలిసి విజయవాడ వెళ్లారు. కుటుంబ సభ్యులు కూడా వీరితో పాటు ఉన్నారు. విజయవాడలో మంత్రి బాలినేనిని కలిసి జరిగిన సంఘటనను వివరించినట్లు తెలిసింది. మంత్రి బాలినేని సుబ్బారావును సముదాయించారు.. తానెప్పుడూ బాలినేని, వైకాపా విధేయుడునేనని.. పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రమే తాను వ్యాఖ్యానించానని, దాడులు సంస్కృతి ఏ పార్టీకీ మంచిది కాదని మంత్రి చెపినట్లు తెలుస్తుంది. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి, మంత్రి, గుప్తా, కుటుంబ సభ్యులు ఒకరికొకరు తినిపించుకున్నారు. ఇక్కడితో ఈ వివాదం సమసిపోవాలని ఇరు వర్గాలు మాట్లాడుకున్నారు.
అసలేం జరిగిందంటే..
ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో సుబ్బారావు గుప్తా మాట్లాడుతూ.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై చేసిన వ్యాఖ్యలతో ఆయనకు బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే సోమవారం గుంటూరులో ‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను..’ అంటూ సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.