సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలోని రెండు వందల మంది వలస కార్మికులకు పోలీసుల చేతుల మీదగా నిత్యవసరాలు పంపిణీ చేశారు. దాతల సహకారంతో నిత్యావసర సరుకులు అందించడాన్ని మహంకాళి ఏసీపీ వినోద్ కుమార్ అభినందించారు. శ్రీకాకుళం, ఒడిశా, బీహార్, ఛత్తీస్గఢ్ ప్రాంతాలకు చెందిన వలస కూలీలు కంటోన్మెంట్‌లోని వాల్మీకి నగర్, సంజయ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు.
వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణీ - లాక్‌డౌన్
సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో వివిధ కాలనీల్లో నివాసముంటున్న 200ల మంది వలస కూలీలకు పోలీసుల చేతుల మీదగా నిత్యవసరాలు పంపిణీ చేశారు. దాతల సహకారంతో నిత్యావసర సరుకులు అందించడాన్ని మహంకాళి ఏసీపీ వినోద్ కుమార్ అభినందించారు.
వలస కూలీలకు నిత్యావసరాలు పంపిణి
ప్రస్తుత పరిస్థితుల్లో వారంతా ఉపాధి కోల్పోగా.. భోజనం కూడా లేని పరిస్థితి నెలకొంది. విషయాన్ని తెలుసుకున్న దాతలు పోలీసుల సహకారంతో బియ్యాన్ని అందజేశారు. తమ గోడు విని ముందుకొచ్చిన దాతలకు, పోలీసులకు.. కూలీలు ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి:అందుబాటులో వలస కూలీలు.. పనులకు పచ్చజెండా!