తెలంగాణ

telangana

ETV Bharat / city

అవసరానికి అప్పు ఇచ్చాడు .. తర్వాత తన దుర్బుద్ధిని బయటపెట్టాడు - Man harassing woman latest news

ఇంట్లో అవసరాల కోసం ఓ మహిళ ఓ వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు. మంచి మనసున్న వ్యక్తి అవసరానికి అప్పు ఇచ్చాడనుకున్నారు. తీసుకున్న నగదు సర్దుబాటు కావడంతో అప్పు ఇచ్చిన వ్యక్తికి తిరిగి ఇవ్వడానికి వెళ్లారు. డబ్బు వద్దన్నాడు.. కానీ తన దుర్బుద్ధిని బయటపెట్టాడు. కోరిక తీర్చాలని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. అతని తీరుపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితురాలు వాపోయింది.

ఏపీ
ఏపీ

By

Published : Oct 3, 2022, 8:18 PM IST

ఏపీ వైఎస్​ఆర్​ కడప జిల్లా వేంపల్లికి చెందిన వేంపల్లి నాగమ్మ అవసరాల కోసం సుబ్బరాయుడు అనే వ్యక్తి దగ్గర లక్ష 60వేల రూపాయలు రెండు సంవత్సరాల క్రితం అప్పు తీసుకున్నారు. నగదు సర్దుబాటు కావడంతో అప్పు తీర్చేందుకు అతని దగ్గరకు వెళ్లారు. తిరిగి అప్పు చెల్లిస్తామంటే నాకు డబ్బులు అవసరం లేదన్నాడు.. అదేంటి డబ్బులు తీసుకోండి అంటే నెమ్మదిగా తన దుర్బుద్దిని బయటపెట్టాడు.

తన కోరిక తీర్చాలని ఆమెను వేధించాడు. గతంలో రెండుసార్లు వేంపల్లి నాగమ్మ కిడ్నాప్​ చేశాడు. అంతేకాకుండా తన కుమారుడిపై కత్తితో దాడి చేశాడని ఆమె కన్నీటిపర్యంతమైంది. ఇలా దాడులకు దిగుతూ తమ కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడని వేంపల్లి నాగమ్మ ఆరోపించింది. ఈ దాడిలో తలకు తీవ్రగాయం కావడంతో తన కుమారుడికి మాట పడిపోయిందని వేంపల్లి నాగమ్మ తెలిపింది.

సుబ్బరాయుడు తీరుపై రేపల్లె పోలీసులకు నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వేంపల్లి నాగమ్మ ఆరోపించింది. అతనిపై చిన్న కేసు మాత్రమే నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. సుబ్బరాయుడు నుంచి తనకు రక్షణ కల్పించాలని.. ఆతనిపై చర్యలు తీసుకోవాలని వేంపల్లి నాగమ్మ కోరుతుంది.

ఇవీ చదవండి:పోలీసులు ఆపారని తన బైక్‌ను తానే తగులబెట్టిన వ్యక్తి

గర్బా డ్యాన్స్ చేస్తూ యువకుడు మృతి.. మరణాన్ని తట్టుకోలేక తండ్రి సైతం..

ABOUT THE AUTHOR

...view details