Dance in Vinayaka Immersion: ఏపీలోని పలు ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. భక్తి శ్రద్దలతో పూజలు చేసి.. డప్పులు, తీన్మార్ స్టెప్పులతో గణనాధుడ్ని సంతోషంగా గంగమ్మ ఒడికి చేరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ పాల్గొంటున్నారు. వాయిద్యాలకు అనుగుణంగా స్టెప్పులేస్తున్నారు. వినాయక నిమజ్జనం భద్రత కోసం వచ్చిన పోలీసులు సైతం భక్తులతో కలిసి సరదాగా స్టెప్పులేస్తుంటారు.
SI dance in Devanakonda: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా దేవనకొండ మండల కేంద్రంలో వినాయక నిమజ్జనం వేళ ఎస్ శ్రీనివాసులు సందడి చేశారు. శోభాయాత్రలో యువకులతో కలిసి నృత్యాలు చేశారు. వాయిద్యాలకు అనుగుణంగా చిందేసి యువకులను ఉత్సాహపరిచారు. అప్పటివరకు ఊరేగింపునకు భద్రత కోసం వచ్చాడనుకున్న యువకులు.. ఎస్ఐ డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆ తరువాత శ్రీనివాసులుతో కలిసి అందరూ హంగామా చేస్తూ.. వివిధ పాటలకు స్టెప్పులేశారు.