రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సభ్యులను నియమించింది. ఈ మేరకు ఏపీ స్టేట్ పోలీసు కంప్లైంట్స్ అథారిటీకి ముగ్గురు సభ్యులను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ సంస్థకు ఛైర్మన్‌గా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఇక రాష్ట్ర స్థాయి అథారిటీకి సభ్యులుగా విశ్రాంత ఐపీఎస్ అధికారి కె.వి.వి. గోపాలరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి బి.కిషోర్, ఉదయ లక్ష్మిని సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పోలీసు కంప్లైట్స్ అథారిటీ సభ్యుల కాలవ్యవధి మూడేళ్ల పాటు లేదా 65 ఏళ్ల వయసు వచ్చే వరకూ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయిలోనూ ఛైర్మన్లు, సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. మూడేసి జిల్లాలకు ఒక ఛైర్మన్, ఇద్దరు సభ్యులను ప్రభుత్వం నియమించింది. విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు విశ్రాంత జిల్లా అదనపు న్యాయమూర్తి అనింగి వరప్రసాద రావును ఛైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.