"సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకోవటంలో ముందుండాలనే లక్ష్యంతో.. అన్ని విభాగాలను సమన్వయపరిచి ఒక ఫ్యూజన్ సెంటర్లా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో చాలా ప్రత్యేకతలున్నాయి. దీన్ని పర్యవరణహిత భవనంగా కట్టాం. దీన్ని ఐదు టవర్లుగా విభజించాం. టవర్-ఏలో హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఉంటుంది. టవర్-బీలో రాష్ట్రానికి సంబంధించిన అన్ని టెక్నాలజీస్ ఉంటాయి. టవర్-సీలో ఆడిటోరియం, టవర్- డీలో మీడియా, టవర్-ఈ అనేది కమాండ్ కంట్రోల్ సెంటర్, డేటా సెంటర్ ఉంటుంది. పర్యావరణహిత, ఐకానిక్ భవనాన్ని రేపు ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేశాం." - సీవీ ఆనంద్, హైదరాబాద్ సీపీ
పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సర్వం సిద్ధం.. - hyderabad cp cv anand
Police Command Control Center: పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి ఈ కేంద్రాన్ని ప్రారంభిస్తారని సీపీ సీపీ ఆనంద్ తెలిపారు. పర్యావరణహిత, ఐకానిక్ భవనాన్ని రేపు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు పేర్కొన్నారు.
Police Command Control Center is ready to inauguration