బేగంపేటలోని ఓ పబ్బు వద్ద మందుబాబులు వీరంగం సృష్టించారు. మద్యం మత్తులో పోలీసులపై దాడికి యత్నించారు. హైఫై పబ్బును అర్ధరాత్రి సమయంలో మూసివేసేందుకు వచ్చిన పోలీసులతో మద్యం మత్తులో ఉన్న కొందరు గొడవకు దిగి, దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మందేశారు... పోలీసులపై దాడికి యత్నించారు - pub
హైదరాబాద్ బేగంపేటలోని ఓ పబ్ మూసేందుకు వచ్చిన పోలీసులపై మందుబాబులు దాడికి యత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.
మందేశారు... పోలీసులపై దాడికి యత్నించారు
అదే పబ్బుకు వస్తున్న ఓ యువతిని దారిలో ద్విచక్ర వాహనాలపై మరికొందరు వెంబడించి వేధించారు. ఆందోళన చెందిన యువతి కేకలు వేసింది. వెంటనే అక్కడకి చేరుకున్న యువతి స్నేహితుడితో వారు గొడవకు దిగారు. స్థానికులు నిలదీయగా వేధించిన యువకులు పరారయ్యారు.
ఇదీ చూడండి: బస్తీమే సవాల్: గులాబీ తోటలో వికసించేందుకు కమలనాథుల వ్యూహాలు...