సరోగసీ విధానం ద్వారా సంతానాన్ని కలగచేస్తామని నమ్మించి మోసం చేసిన ఘటన సికింద్రాబాద్‌లోని గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌పై కేసు నమోదు చేసినట్లు గోపాలపురం ఏసీపీ వెంకటరమణ తెలిపారు.
అద్దె గర్భంతో సంతానాన్ని కలిగిస్తామని చెప్పి ఏపీలోని విశాఖపట్నానికి చెందిన నీతూ గుప్తా దంపతుల వద్ద రూ.13లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. 2019 జులై నుంచి ఇప్పటి వరకు 12.5 లక్షలు చెల్లించినట్లు బాధితులు తెలిపారు. ఒప్పందం ప్రకారం అక్టోబర్ నాటికే శిశువును అప్పగించాల్సి ఉన్నా.. ఇవ్వలేదని, గత కొంతకాలంగా ఫోన్ చేసినా స్పందన లేదని బాధితులు చెప్పారు. విశాఖలోని సృష్టి సంతాన సాఫల్య కేంద్రంపై కేసు నమోదు కావడం వల్ల బాధితులు మోసపోయామని గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. దర్యాప్తు చేస్తున్నాం.