Police Case on Janasena Activists: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటనపై విమానాశ్రయ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మంత్రి రోజా సహాయకుడు దిలీప్ కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మంత్రి రోజాపై కొందరు వ్యక్తులు దాడికి ప్రయత్నించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లోహపు మూత తగిలి తన తలకు గాయమైందని దిలీప్ ఫిర్యాదులో తెలిపారు. 300 మంది జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని.. ప్రభుత్వ వాహనాలు, ఆస్తులను ధ్వంసం చేశారన్నారు.
విశాఖ ఎయిర్పోర్ట్ ఘటన.. 28 మంది జన సైనికులపై కేసులు - Cases against janasena soldiers
Police Case on Janasena Activists: ఏపీలోని విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శనివారం జరిగిన ఘటనపై పోలీసు కేసులు నమోదయ్యాయి. మంత్రి రోజా సహాయకుడు దిలీప్‌కుమార్ ఫిర్యాదు మేరకు ఒక కేసు.. ఎయిర్‌పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న పెందుర్తి ఇన్స్పెక్టర్ ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు.
police
28 మంది జనసేన నేతలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎయిర్ పోర్టులో విధులు నిర్వర్తిస్తున్న పెందుర్తి ఇన్స్పెక్టర్ బి.నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. పలువురిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: