Anna Canteen row in Vizag: ఏపీలోని విశాఖ కేజీహెచ్ వద్ద అన్న క్యాంటీన్ ఏర్పాటును పోలీసులు అడ్డుకున్నారు. క్యాంటీన్ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ నిరాకరించడంతో తెలుగుదేశం నేతలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎటువంటి అనుమతులు లేకుండా.. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం తగదని పోలీసులు చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జి ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు.
విశాఖలో అన్న క్యాంటీన్‌ను అడ్డుకున్న పోలీసులు.. రోడ్డుపై నేతల బైఠాయింపు - tdp leaders protest
Anna Canteen row in Vizag: విశాఖ కేజీహెచ్ వద్ద పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడానికి అనుమతులు లేవని పోలీసులు తేల్చిచెప్పడంతో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు, నేతలకు మధ్య తోపులాట జరిగింది.
Anna Canteen
కేజీహెచ్ గేట్ వద్ద గత ప్రభుత్వ హయాంలో ఉన్న అన్న క్యాంటీన్ స్థలంలోనే మళ్లీ ఇవాళ పేదలకు భోజనం పెట్టేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ కేజీహెచ్ బయట.. తెదేపా నేత గండి బాజ్జి ధర్నా చేశారు. రోడ్డు పక్కనే పేదలకు భోజనాలు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి: