తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్.. ఏసీబీ అంటూ డబ్బు వసూళ్లు - కర్నూలు క్రైమ్ వార్తలు

ఏసీబీ అధికారులమని బెదిరిస్తూ... డబ్బులు వసూలు చేస్తున్న ఓ ముఠాను ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని ప్రభుత్వ అధికారులే లక్ష్యంగా... ఈ వ్యవహారం నడుపుతున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్..
ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్..

By

Published : Sep 2, 2020, 8:39 PM IST

ఏసీబీ అధికారులమంటూ.. బెదిరింపులకు పాల్పడుతున్న ఆరుగురిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ట్రైనీ ఎస్పీ శివకిషోర్ తెలిపారు. గతంలో ఏసీబీ అధికారినని బెదిరింపులకు పాల్పడి జైలుకెళ్లిన జయకృష్ణ... తన తోటి నేరస్థులతో ఓ ముఠాగా ఏర్పడి... ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు శివకిషోర్ వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు 70 నుంచి 80 మంది ఉద్యోగులను బెదిరించారని... రూ.14,34,000 వసూలు చేశారని ట్రైనీ ఎస్పీ వివరించారు.

ప్రభుత్వ ఉద్యోగులే టార్గెట్..

ABOUT THE AUTHOR

...view details