Thieves robbing in locked houses arrested: ఏపీలోని విజయవాడలో పలు ప్రాంతాల్లో.. తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనం చేసిన కేడీలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో ఉంచిన ఎల్‌హెచ్‌ఎంఎస్ ద్వారా నిందితులను గుర్తించిన పోలీసులు.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌కు ప్రత్యేక బృందాలను పంపి అరెస్ట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన ఓ వ్యక్తి.. ఇండోర్‌లోని ఈ ముఠాతో పరిచయం పెంచుకున్నాడు. ఇతను.. దొంగలను విజయవాడకు రప్పిస్తాడు. వీరంతా కలిసి నగరంలోని పలు ప్రాంతాల్లో.. పగలు రెక్కీ నిర్వహిస్తారు. తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని.. రాత్రిళ్లు దొంగతనాలకు పాల్పడతారు.