తెలంగాణ

telangana

ETV Bharat / city

పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్ - రావులపాలెంలో పాదయాత్రకు వెళ్తున్న నేతల అరెస్ట్

Police Arrested TDP Leaders: ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో సాగుతున్న అమరావతి రైతుల పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న తెదేపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. రావులపాలెం మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావును పీఎస్​కు తరలించారు. వాహనాలను ముందుకు వెళ్లకుండా నిలువరించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగిన నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు. తమ నాయకులను అదుపులోకి తీసుకోవటంతో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు.

Police arrested TDP leaders
Police arrested TDP leaders

By

Published : Oct 17, 2022, 3:47 PM IST

పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న తెదేపా నేతల అరెస్ట్

Police Arrested TDP Leaders: ఆంధ్రప్రదేశ్​లోని అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి ఏపీ తెదేపా ఉపాధ్యక్షుడు బండారు సత్యానందరావు ఆధ్వర్యంలో అమరావతి పాదయాత్రకు మద్దతు తెలిపేందుకు వెళుతున్న తెదేపా నాయకులు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొత్తపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన తెదేపా కార్యకర్తలు, నాయకులు రావులపాలెం చేరుకుని అక్కడి నుంచి అమరావతి పాదయాత్రకు వెళ్తున్న తరుణంలో పోలీసులు అనుమతి లేదని అడ్డగించారు.

వారి కార్లను వెళ్లకుండా నిలుపుదల చేయడంతో.. తాము కూడా పాదయాత్ర చేసుకుంటూ వెళ్తామని వెళ్తున్న వారిని జాతీయ రహదారిపై పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన చేశారు. బండారు సత్యానందరావు, ఏపీ తెదేపా రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు. దీంతో నాయకులు, కార్యకర్తలు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details