ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యులను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్, ప్రత్తిపాటి, ఆనంద్‌బాబు పరామర్శించారు. గుంటూరు నగరంలోని రమ్య ఇంటికి వెళ్లిన లోకేశ్ వారికి ధైర్యం చెప్పారు. లోకేశ్‌ను చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. రమ్య కుటుంబసభ్యులను పరామర్శించిన తర్వాత మాట్లాడిన లోకేశ్.. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇంట్లోని మహిళలకే ముఖ్యమంత్రి రక్షణ కల్పించలేని పరిస్థితుల్లో ఉన్నారని విమర్శించారు.
తెదేపా-వైకాపా శ్రేణుల తోపులాట
మరోవైపు కేవలం రాజకీయ లబ్ధికే లోకేశ్ వచ్చారంటూ వైకాపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో పరమయ్యగుంటలో తెదేపా, వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని నారా లోకేశ్‌ను అరెస్టు చేసి ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రత్తిపాటి, ఆనంద్‌బాబు, ధూళిపాళ్లను వేర్వేరు పీఎస్‌లకు తరలించారు.