ఏపీలోని అనంతపురం జిల్లా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉగండా దేశంలో ఉంటున్న ఓ యువకుడు వైకాపా ఎమ్మెల్యేని అవమానించేలా ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టారంటూ ఓ వైకాపా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు పోస్టు పెట్టిన యువకుడి తండ్రిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేపై పోస్టుపెట్టిన కుమారుడు.. తండ్రిని తీసుకెళ్లిన పోలీసులు - latest news of kadiri
ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఉగండాలో ఉండే ఓ యువకుడు కదిరి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టగా.. కదిరిలో ఉంటున్న సామాజిక మాధ్యమాలపై కనీస అవగాహన లేని అతని తండ్రిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఉగాండాలో ఉంటున్న తెలుగుదేశం సానుభూతిపరుడైన ఓబుళారెడ్డి.. కదిరి ఎమ్మెల్యేని ఉద్దేశిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తమ ఎమ్మెల్యేని కించపరుస్తూ పోస్టు పెట్టారంటూ.. వైకాపా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వెంటనే స్పందించి.. నంబులపూలకుంటలో నివాసముండే యువకుడి తండ్రిని విచారణ పేరిట కదిరికి తీసుకొచ్చారు. కుమారుడు పోస్ట్ చేస్తే.. తండ్రిని స్టేషన్‌కు పిలవడంపై.. తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఫేస్బుక్ అంటేనే తెలియదని ఆ యువకుడి తండ్రి చెబుతున్నారు.
ఇదీచూడండి:చంద్రబాబుకు అమిత్‌షా ఫోన్.. ఏపీలోని రాజకీయ పరిణామాలపై ఆరా..